![]() |
![]() |

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి తండ్రి లాస్ట్ మంత్ చనిపోయిన విషయం తెలిసిందే. తన తండ్రి ఇక లేరు అని తెలిసాక ఎంతో బాధపడింది. కన్నీరు మున్నీరు అయ్యింది. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రీతూ చౌదరి. తండ్రితో కలిసి దిగిన ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. "ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు.
ఇది నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో నాన్న." అంటూ రీతూ చౌదరీ పెట్టిన ఎమోషనల్ గా పోస్ట్ ఎంతో మందిని కదిలించింది. అలాగే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యాక్టర్ తారకరత్న కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన కూతురు కూడా తండ్రి లేని విషయాన్ని తలచుకుని చాలా బాధపడడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లకు నాన్నే హీరో, ఆయనే సూపర్ మాన్..అలాంటి నాన్న లేకపోతే వాళ్ళు జీవితంలో చాలా కోల్పోయినట్టు భావిస్తారు.
తారకరత్న భుజం మీద ఆయన కూతురు తలవాల్చిన ఫోటో ఒకటి, కింద తండ్రి శవం దగ్గర ఏడుస్తున్న ఫోటోను కొలెజ్ చేసి "ఈ సృష్టిలో తండ్రి ఒక ధైర్యం.. ఆ ధైర్యం కోల్పోతే ఆ జీవితం నరకప్రాయం" అని కాప్షన్ తో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది రీతూ చౌదరి.. హైపర్ ఆది స్కిట్స్ లో చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్న లేడీ కమెడియన్లలో రీతూ చౌదరి ఒకరు. ఇటు జబర్దస్త్ షో పాటు మరోవైపు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది.
![]() |
![]() |